Sunday, November 28, 2021

ప్ర‌త్యేక ఓట‌ర్ల న‌మోదు కార్య‌క్ర‌మం : మాధ‌వీల‌త

ఈరోజు, రేపు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. ఈరోజు స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి జిల్లా కోర్టు సెంటర్ వరకు నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ…ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఓటర్ల‌ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల‌ని, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఖాజావలి, తహసీల్దార్ సునీల్ బాబు, వీఆర్వోలు, బీఎల్ వోలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News