Monday, May 6, 2024

మ‌నోజ్ కొత్త ఇంట్లో.. సాయిధ‌ర‌మ్ తేజ్

హీరో మంచు మ‌నోజ్ ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. అంతేకాదు మ‌నోజ్ మెగా హీరోల‌తో స్నేహంగా ఉంటారు. ఇక ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా అంద‌రికీ తెలిసిందే.ఇటీవ‌లే రెండో వివాహం చేసుకున్నారు మ‌నోజ్. కాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో మ‌రో హీరో మనోజ్ అత్యంత సన్నిహితంగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల మనోజ్ – సాయిధరమ్ అండ్ బ్యాచ్ మనోజ్ కొత్త ఇంట్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన స్నేహితులే వంట మాస్టర్లుగా మారి కుకింగ్ కూడా చేశారు. నైట్ పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసారు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని మనోజ్ షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో సాయి తేజ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించగా.. మనోజ్ తన సతీమణి మౌనిక కుమారుడిని ఎత్తుకుని ఎంతో ఆప్యాయంగా కనిపించారు.ఈ సందర్భంగా మనోజ్ ఓ ఫోటోని షేర్ చేసి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈరోజు నా కొత్త ఇంటిలో నా సోదరులతో ఒక సూపర్ వంట సెషన్ జరిగింది. నవీన్ విజయ్ కృష్ణ (సీనియర్ నరేష్ కుమారుడు యువహీరో) బెస్ట్ బిర్యానీ వండాడు. మా బిరియానీ టైమ్స్ రంజిత్ వండిన బటర్ చికెన్ తినడానికి చాలా కిక్కిచ్చింది.. అని తెలిపారు. బ్లాక్ బస్టర్ #విరూపాక్ష ను అందించిన జెట్ పంజా బాబాయ్ (తేజ్) కి అభినందనలు. #బ్రదర్స్ ఎప్పటికీ లవ్ యు అంటూ లవ్ ఈమోజీలను మనోజ్ షేర్ చేసారు.ఇప్పుడు వీరు దిగిన ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement