Monday, April 29, 2024

స‌రికొత్త‌గా.. మ‌హేశ్ బాబు లుక్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌రికొత్త లుక్ తో మెరిశారు.ఆ ఫొటోని త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎస్ఎస్ఎంబి 28 నెక్స్ట్ షెడ్యూల్ కి గ్యాప్ రాగా మహేష్ బాబు సేద తీరుతున్నారు.న్యూ పిక్ లో మెస్సి హెయిర్, గడ్డంతో కూడిన మహేష్ సరికొత్తగా ఉన్నారు. మహేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఎస్ఎస్ఎం బి 28 చిత్ర షూటింగ్ జూన్ మొదటివారం నుండి తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. మూడు నెలలు నిరవధికంగా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ నందు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ కానుందట. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సమయం తక్కువగా ఉంది. అందుకే మేకర్స్ బిజీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement