Friday, May 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్.. తెలుగులో ట్వీట్ చేసిన హృతిక్

తెలుగులో హీరో ఎన్టీఆర్ కి బ‌ర్త్ డే విషెష్ చెప్పారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్. కాగా హృతిక్ చేసిన ట్వీట్ లో ఓ విషయంలో హింట్ కూడా ఇచ్చారు.పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్. ఈ సంతోషకరమైన రోజును నువ్వు ఎంజాయ్ చేయాలని, రాబోయే సంవత్సరంలో పూర్తి యాక్షన్ ప్యాక్ తో సాగాలని కోరుకుంటున్నా. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా. మనం కలి సేంత వరకు నీకు ప్రతి రోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు. చివర్లో ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అని పేర్కొన్నారు.ఓ వైపు విష్ చేస్తూనే ‘వార్ 2’ గురించి హృతిక్ హింట్ ఇచ్చారు. ‘వార్’లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. అందులో టైగర్ ష్రాఫ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు. అయితే అధికార ప్రకటన ఇంకా రాలేదు. యుద్ధభూమిలో కలుద్దాం , నేను కలిసేంత వరకే నీకు ప్రశాంతత అంటూ హృతిక్ చేసిన కామెంట్లు ‘వార్ 2’ను ఉద్దేశించేనని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement