Friday, May 17, 2024

MBNR : క్రీడాకారుల‌కు కిట్స్ అంద‌జేత‌

మక్తల్, మే3(ప్రభన్యూస్) : ఈనాడు లక్ష స్పోర్ట్స్ క్లబ్ విద్యార్థులకు బికెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 విద్యార్థులకు(క్రీడాకారులకు) స్పోర్ట్స్ షూ, స్పోర్ట్ డ్రస్సులను బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి అందజేశారు. ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన క్రీడల్లో శిక్షణ పొందుతూ వివిధ క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటుతున్న క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో డీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ స్పోర్ట్స్ షూ స్పోర్ట్స్ డ్రెస్ లను అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ ప్రాంతంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకలిగిన ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఎందరు ఉన్నారని అలాంటి క్రీడాకారులను వెలిక తీసి వారికి మంచి శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. క్రీడాకారులకు ఏ అవసరమున్న తనవంతు సహకారం ఎల్లవేళలా అందజేస్తానని అన్నారు. బాలబాలికలు క్రీడల్లో మంచి శిక్షణ పొంది ప్రతిభను చాటి ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి సూచించారు .ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా పూర్తిగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు జి.గోపాల్ రెడ్డి , పారేవుల విష్ణువర్ధన్ రెడ్డి,పసుల రంజిత్ రెడ్డి, చందాపూర్ రాములు,సాలంబిన్ ఉమర్ బస్రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి తోపాటు ఇతర నాయకులను ఈనాడు లక్ష స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement