Sunday, April 28, 2024

Hamsa Nandini: బికినీతో హంస న‌డ‌క…

వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ హంసా నందిని. హీరోయిన్‌ గా స్టార్‌ డమ్‌ దక్కించుకోవడంలో విఫలం అయినా కూడా తన అందంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా హంసా నందిని అందాల ఆరబోత చూడవచ్చు.

రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య క్యాన్సర్‌ తో పోరాటం చేసిన హంసా నందిని తన జుట్టును కూడా కోల్పోయింది. గుండుతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కూడా దిగదుడుపు అన్నట్లుగా అందాల ఫోటోలతో ఆకట్టుకుంది. స్విమ్‌ సూట్‌ లో స్విమ్మింగ్‌ పూల్ వద్ద నీటిలో దిగాలా వద్దా అన్న సంశయం లో ఉన్నట్లుగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఈ యాంగిల్‌ లో చూస్తే అందాల జల కన్య లా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement