Wednesday, May 15, 2024

గుట్టు చప్పుడు ఫస్ట్ లుక్ ఊర మాస్…. బ్రహ్మాజీ కొడుకు సూపర్

మామూలుగా సినీ ఇండస్ట్రీలోకి నటులు నటీమణులు తమ వారసులను తీసుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నటుడు బ్రహ్మాజీ కూడా తన కొడుకు సంజయ్ రావు ను తీసుకొచ్చాడు. ఓ పిట్ట కథ సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు సంజయ్ రావు. ఇప్పుడు గుట్టుచప్పుడు సినిమాతో సోలో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను పాటు మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

హీరో సంజయ్ బర్త్ డే సందర్భంగా ఈ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అందరికీ థాంక్స్ చెప్పాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్షన్ మూవీ గా వైజాగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సంజయ్ అన్నారు. ఇక ఫస్ట్ లుక్ ను చూస్తుంటే పక్క మాస్ లుక్ లో సంజయ్ కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement