Friday, May 3, 2024

గుత్తా జ్వాల ఇంట్లో ప్రారంభం అయిన పెళ్లి సందడి

ఈ నెల 22న బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు విష్ణు విశాల్ ను ఆమె వివాహం చేసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న వేళ అతి తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక పెళ్లి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో గుత్తా జ్వాల ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఆమె ఫ్రెండ్స్ రాకతో ఇల్లంతా సందడిగా మారింది. కాగా విష్ణు విశాల్ గుత్తాజ్వాల ఇద్దరికి కూడా ఇది రెండో వివాహం. 2010 లో రజనీ నటరాజన్ ను పెళ్లి చేసుకున్న విశాల్ ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇక 2005లో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను పెళ్లి చేసుకున్న గుత్తాజ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement