Monday, April 29, 2024

అజయ్ భూపతి తో అఖిల్ కొత్త సినిమా ?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో అఖిల్ అభిమానులను ఆకట్టుకున్నాడు. పొడుగాటి జుట్టు, సిక్స్ ప్యాక్ తో అఖిల్ ఆ లుక్ లో కనిపించాడు.

ఇక మరోవైపు ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తో ఓ సినిమా చేయబోతున్నాడట అఖిల్. ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అజయ్ భూపతి మహాసముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక మహాసముద్రం తరువాత అఖిల్ తోనే అజయ్ భూపతి సినిమా చేయబోతున్నాడట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement