Thursday, April 25, 2024

‘మీకు’ అని ఉంటే సగం ఆస్తి ఇచ్చే వాడిని: నాగబాబు

నటుడు నాగబాబు సోషల్ మీడియాలో, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈమధ్య ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు నాగబాబు. ఒక నెటిజన్ నాగబాబును ఉద్దేశించి నెటిజన్ ‘మీ ఇల్లు ఓ 50 కోట్లు ఉంటుందా?’ అని అడిగితే, “ముఖేశ్ అంబానీ ఇంటి కంటే ఓ పది రూపాయలు తక్కువ ఉంటుందంతే” అంటూ తమాషాగా సమాధానమిచ్చారు.

ఇక మరో నెటిజన్ నాగబాబు ని ‘ఎంత ఆస్తి ఉంది నీకు?’ అని అడిగాడు. ఆ మాటకు నాగబాబు తీవ్రమైన అసహనానికి లోనైనట్టు తెలుస్తోంది. అందుకు ఆయన స్పందిస్తూ .. “నన్ను నువ్వు అని సంబోధించావు గనుక నీకు రెస్పెక్ట్ తగ్గిపోయింది. అందువలన నీకు సమాధానం చెప్పను. మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పడమే కాకుండా నీకు సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్” అంటూ తనదైన స్టైల్లో చురక అంటించారు. నాగబాబు అప్పుడప్పుడు ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహిస్తూ ఉంటారు. అలా తాజాగా ఆయన ఇద్దరు నెటిజన్లకు ఇచ్చిన ఆన్సర్ల తాలూకు స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement