Friday, May 3, 2024

జెనీలియాకు కోపం వచ్చింది…

సీనియర్ హీరోయిన్ జెనీలియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. రకరకాల ఫోటోలను ఫన్నీ ఫన్నీ వీడియో లను పోస్ట్ చేస్తూ ఉంటారు. జెనీలియా తాజాగా తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తన ముందు ప్రీతి జింతా చేతులకు ముద్దు పెడుతున్నట్లుగా వీడియో ను పోస్ట్ చేసింది. నా ముందే వేరే అమ్మాయి కి ముద్దు పెడతావా ఇంటికి రా నీపని చెప్తా అంటూ పిడిగుద్దులు గుద్దింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో ను తాజాగా ప్రీతిజింతా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ జెనీలియా రితేష్ ఇలాంటి వీడియోలు మరిన్ని మా ముందుకు తీసుకురండి అంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియో పై పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జెనీలియా రితేష్ లు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

https://www.instagram.com/p/CMmhw5iBWEt/?utm_source=ig_web_button_share_sheet

Advertisement

తాజా వార్తలు

Advertisement