Saturday, April 20, 2024

న్యాయ‌శాఖ సిబ్బందికి క‌రోనా టీకా ప్ర‌త్యేక శిబిరం..

మ‌చిలీప‌ట్నం – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం న్యాయవాదులకు న్యాయశాఖ సిబ్బందికి కరోన రాకుండా ప్రత్యేక ఉచిత వ్యాక్సిన్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. లక్ష్మణరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రాజారాం, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వడ్డీ జితేంద్ర తుంగల హరిబాబు ఆధ్వర్యంలో కరోన ఫ్రీ వ్యాక్సిన్ శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయవాదులకు న్యాయ శాఖ సిబ్బంది కి వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏ విధమైన సైడ్ఎఫెక్ట్స్ లేకుండా హాస్పిటల్ నర్సింగ్ సిబ్బంది చక్కటి సహాయ సహకారాలు అందించారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వస్తున్న సమయంలో జిల్లా జడ్జి లక్ష్మణరావు చొరవతో జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులకు న్యాయశాఖ సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం పట్ల మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ , ఆరేపు వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని అని, రెండు రోజులపాటు మజ్జిగ కొబ్బరి నీరు వంటి ద్రవ ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.వ్యాక్సిన్ తీసుకున్న వారెవరికీ మచిలీపట్నం లో ఈరోజు వరకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం కూడా కొనసాగించడం జరుగుతుంది నిర్వాహకులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement