Friday, April 26, 2024

ఫైనల్ మ్యాచ్ కు రెడీ అవుతున్న వరుణ్ !!

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గని తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ను జూలై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా బాక్సింగ్ ఆటలో భాగంగా వచ్చే క్వార్టర్ ,ఫైనల్ మ్యాచ్ ల కు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సర్ గా వరుణ్ ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement