Wednesday, May 1, 2024

మాస్ట్రో నుంచి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మాస్ట్రో. హిందీలో సూపర్ హిట్ మూవీ అందాదున్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా చిత్ర యూనిట్ తాజాగా ఓ సాంగ్ ను విడుదల చేసింది.

వెన్నెల్లో ఆడపిల్ల అనే సాంగ్ ఫుల్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రేయసికి దూరమైన ప్రియుడు ఆమెను తలుచుకుంటూ బాధతో పాడుకునే పాట ఇది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement