Wednesday, May 1, 2024

భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ ఎవరివో తెలుసా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. అలాగే నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రనుందట. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా….థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement