Monday, April 29, 2024

టాలీవుడ్ పై.. స్టార్ హీరో జ‌యంర‌వి ఫోక‌స్

టాలీవుడ్ పై ఫోక‌స్ చేశాడు త‌మిళ హీరో జ‌యం ర‌వి. కాగా జ‌యం ర‌వి ఎడిటర్ మోహన్ కి తనయుడు .. దర్శకుడు మోహన్ రాజాకి సోదరుడు. జయం రవి బాలనటుడిగా ‘బావ బావమరిది’.. ‘పల్నాటి పౌరుషం’ సినిమాల్లో నటించాడనే విషయం చాలామందికి తెలియదు. తెలుగులో నితిన్ హీరోగా చేసిన ‘జయం’ సినిమా, అదే టైటిల్ తో తమిళంలో రీమేక్ అయింది. ఆ రీమేక్ తోనే రవి అక్కడ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటి నుంచి హీరోగా ఆయన తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు.

ఆయన సినిమాలు అనువాదాలుగా ఇక్కడికి వచ్చినవి చాలా తక్కువ. అందువలన ఇక్కడి ప్రేక్షకులకు ఆయన అంతగా కనెక్ట్ కాలేదు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమాలో విక్రమ్ .. కార్తి పాత్రల డామినేషన్ ఎక్కువగా కనిపించినప్పటికీ, టైటిల్ రోల్ ను పోషించింది జయం రవినే. ఈ సినిమాతోనే ఇక్కడ ఆయన ఎక్కువమందికి తెలిశాడు. పార్టు 2తో ఇక్కడి ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగతా కోలీవుడ్ స్టార్స్ మాదిరిగానే, తెలుగులోనేరుగా సినిమాలు చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. కథను మోహన్ రాజా సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మొత్తానికి త‌మిళ న‌టులు టాలీవుడ్ పై మొగ్గు చూపుతుండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement