Friday, April 26, 2024

సుకుమార్ రెడీ…పుష్ప షురూ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఈ పాన్ ఇండియా చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మొదట కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ చిత్రం… ఇటీవలే రీస్టార్ట్ అయింది. అయితే మళ్లీ ఆ తర్వాత వర్షాల కారణంగా బ్రేక్ పడింది. ఇక కొద్ది రోజుల క్రితం సుకుమార్ కు అనారోగ్యం కారణంగా మరోసారి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు సుకుమార్ కోలుకున్నారట. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ… పుష్ప షూటింగ్ కేవలం మూడు రోజులు అయిపోయింది. దర్శకుడు పూర్తిగా కోలుకున్నాడు. సుకుమార్ సోమవారం నుంచి తిరిగి షూట్ ప్రారంభిస్తాడు అని చెప్పారు. దీనిని బట్టి ఈ రోజే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement