Monday, April 29, 2024

పవనోత్సవం…సెప్టెంబర్ 2!!

అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చిందంటే మామూలుగా ఉండదు. వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. రక్త దానాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, బర్త్ డే సిడిపి లు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా అభిమానులు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ఈసారి పవనోత్సవం చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ను సరిగ్గా 50 రోజుల ముందు అంటే ఈ నెల 14న స్టార్ట్ చేయబోతున్నారు. యాభై రోజుల పాటు సోషల్ మీడియాలో ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలలో నటిస్తున్నాడు. వీటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement