Monday, April 29, 2024

అంతా మంచే జ‌రుగుతుంది.. స‌మంతకి లెట‌ర్ రాసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

స్టార్ హీరోయిన్ స‌మంత‌..హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషీ చిత్రంలో న‌టిస్తోంది. దాంతో వారిద్ధ‌రి మ‌ధ్య స్నేహం కుదిరింది. కాగా స‌మంత గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ..ఆయ‌న విడుదల చేసిన నోట్ లో.. స‌మీ.. నువ్వు ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ సరైన పనిచేస్తుంటావు. ఉత్సాహంగానూ ఉంటారు. ఇప్పటికీ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. దానిపైనే నీ కేరీర్ ఆధారపడి ఉంది. కానీ ఏడాదిగా నువ్వు జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో ఎవరికీ తెలియకపోవవ్చు. అయినా ఎప్పుడూ నవ్వుతూ, సినిమాల కోసం ముందడు వేస్తూనే ఉన్నావు. నీ శరీరం విశ్రాంతి తీసుకోమని చెబుతున్నా.. పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా ముందుకెళ్తూనే ఉన్నావు. ఇలాంటి తరుణంలో విడుదలయిన‌ ‘శాకుంతలం’ విజయంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్ అంటూ సుధీర్ఘమైన నోట్ ను విడుదల చేశారు.ఇది చూసిన స‌మంత‌.. విజయ్ దేవరకొండకు రిప్లై ఇచ్చారు. ఇలాంటి సమయంలో నాకు కావాల్సింది ఇదే. మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్యూ మై హీరో’ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం వీరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ ద్వయం దర్శకులు రాజ్ అండ్ డీకే లు కూడా సమంతకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement