Saturday, April 27, 2024

ఎపిలో ధాన్యం కొనుగోలుకు సింగిల్ విండో….

అమరావతి, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత విధానం (సింగిల్‌ విండో సిస్టం) అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్‌ నుంచే ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. వ్యవసాయశాఖ పర్యవేక్షణలో పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల నుంచి రైసుమిల్లులకు తరలించే బాధ్యతలను సర్వీస్‌ ప్రొవైడర్లకు అప్పగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. హమాలీలు, గోనె సంచుల ఏర్పాటు-తో పాటు- ధాన్యం రవాణా, నిల్వ బాధ్యతలు, అక్కడ నుంచి చౌకధరల దుకాణాలకు చేరవేసే బాధ్యతలన్నిటినీ ఇకపై సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థలకు అప్పగించనుంది. ఈ మేరకు ఇప్పటికే 9 జిల్లాల్లో ప్రభుత్వం -టె-ండర్లు పిలిచింది.

రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) నాణ్యతా ప రీక్షలు చేయించటంతో పాటు- అక్కడ నుంచి ధాన్యాన్ని వే బ్రిడ్జికి తీసుకెళ్లి రైతుల సమక్షంలో తూకం వేయించాలి..ఆ తరువాత అక్కడ నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన అన్ని బాధ్యతలు చేపట్టాలి..హమాలీలను సమకూర్చుకోవాలి..సరిపడా గోనె సంచులను తీసుకురావాలి..రవాణా ఏర్పాట్ల బాధ్యత కూడా సర్వీస్‌ ప్రొవైడర్లదే..రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించాక నెలరోజుల్లోపు మర ఆడించి బియ్యంగా మార్చాల్సి ఉంటు-ంది..బియ్యాన్ని కస్టమ్‌ రైస్‌ మిల్లింగ్‌ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో నిర్దేశించిన గోదాములకు తరలించాలి..ఆ తరువాత సంబంధిత తహసిల్దారు ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోపు చౌకధరల దుకాణాలకు చేరవేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. 5 నుంచి 7 వేల టన్నుల సామర్దంతో కూడిన రైస్‌ మిల్లులతో పాటు- గడిచిన రెండేళ్ళలో రూ 100 కోట్ల బిజినెస్‌ టర్నోవర్‌, ధాన్యాన్ని తరలించేందుకు కనీసం అయిదు సొంత వాహనాలున్న సంస్థల యజమానులనే మాత్రమే సర్వీస్‌ ప్రొవైడర్లుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీంతో సర్వీస్‌ ప్రొవైడర్‌ -టె-ండర్లను భారీ రైస్‌ మిల్లులు నడిపే వారు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే రవాణా, కూలీలు, గోనెసంచుల తదితర సమస్యలను నుంచి రైతులకు పరిష్కారం లభించినా సర్వీస్‌ ప్రొవైడర్ల పేరుతో ధాన్యం కొనుగోలు విషయంలో రైసు మిల్లులు గుత్తాధిపత్యం వహించే అవకాశం ఉందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూతన విధానంలో రైసు మిల్లుల నుంచి బియ్యాన్ని గోదాములకు తరలించాక అవసరమైన మేరకు అక్కడ నుంచి నేరుగా చౌకధరల దుకాణాలకు తరలిస్తారు..పాత విధానంలో మండలాన్ని యూనిట్‌ గా చేసుకుని అక్కడి గోదాముల్లో బియ్యాన్ని నిల్వ చేసి చౌకరధరల దుకాణాలకు తరలించే పద్దతి కొనసాగుతోంది. కొత్త విధానం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 268 మండల గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలకు ఉపాధి దూరమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ ఉపాధిని కూడా దృష్టిలో ఉంచుకుని నూతన విధానంలో మార్పులు చేర్పులు చేయాలని హమాలీలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement