Monday, April 29, 2024

నేను క్షేమంగా ఉన్నా.. వీడియో రిలీజ్ చేసిన సుధాక‌ర్

సీనియ‌ర్ క‌మెడియ‌న్ సుధాక‌ర్ క‌న్నుమూసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు. ఈ విషయం సుధాకర్ వ‌ర‌కు చేరడంతో ఆయనే స్వయంగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ తను క్షేమంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. నేను చాలా బాగున్నాను. ఆరోగ్యంగానూ ఉన్నాను. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. నేను హ్యాపీగా ఉన్నారు. దయచేసి అవాస్తవాలను నమ్మకండి. క్షేమంగానే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు, కమెడియన్ లో సుధాకర్ ఒకరు. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన ఓ సినిమాతో ఈయన వెండితెరకు పరిచయం అయ్యారు. నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రొడ్యూసర్ గానూ పలు చిత్రాలను తెరకెక్కించారు. 90లలోనే ఆ సినిమాలు విడుదలయ్యాయి. అటు తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించారు..ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement