Sunday, May 5, 2024

ఆకట్టుకుంటున్న ”నా సామిరంగ” ఫస్ట్ సింగిల్..

నాగార్జున అక్కినేని తాజా చిత్రం నా సామిరంగ. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మ్యాసీ, రగ్గడ్‌ అవతార్‌లో కనిపించనున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ నాగార్జునకు మరో చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌ను అందించడానికి సిద్ధమయ్యారు.

మేకర్స్‌ మొదటి సింగిల్‌ ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది..: పాట విడుదల చేయడంతో మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ గ్రాండ్‌ గా ప్రారంభమయ్యాయి. పాటలో నాగార్జున, ఆషికా రంగనాథ్‌ల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ సాంగ్ మంచి వ్యూస్‌ని దక్కించుకుంటుంది. ఇక ఎప్పటిలాగే నాగార్జున తన హ్యాండ్సమ్‌ లుక్స్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టగా, ఆషికా సాంప్రదాయక గెటప్‌లో ఆకట్టుకుంది. 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందించారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement