Sunday, April 28, 2024

రూ. 110కోట్ల‌కి పైగా గ్రాస్ ను రాబ‌ట్టిన ద‌స‌రా

మార్చి 30న రిలీజ్ అయింది ద‌స‌రా మూవీ. ఈ చిత్రంలో హీరో నాని..హీరోయిన్ కీర్తి సురేశ్ మాస్ లుక్ లో మెరిశారు. కాగా ఈ మూవీ విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ తరువాత వారంలో రవితేజ ‘రావణాసుర’ .. కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాలు థియేటర్లలో దిగిపోయాయి. దాంతో ‘దసరా’ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలు రెండూ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. దాంతో సహజంగానే థియేటర్లలో ‘దసరా’నే కొనసాగుతోంది. ఇంతవరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. అలాగే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ ప్లస్ గ్రాస్ ను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ‘శాకుంతలం’ రిలీజ్ వరకూ ‘దసరా’కు ఢోకా లేనట్టే. మొత్తానికి సినిమా మాట ఎలా ఉన్నా.. వ‌సూళ్ళు మాత్రం బాగా రాబ‌డుతోంది ద‌స‌రా మూవీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement