Friday, April 26, 2024

పవన్ సినిమాకు రెండు పాటలు కంప్లీట్ చేసిన డిఎస్పీ..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కొషియమ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసి అంచనాలు పెంచాడు హరీష్. అలాగే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్సింగ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఫ్యాన్స్ కూడా అదేస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో కూడా గబ్బర్ సింగ్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ సినిమాలోని ప్రతి పాట కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పాటలను అందించేందుకు రెడీ అవుతున్నారట డిఎస్పి. ఇప్పటికే రెండు పాటలు కూడా కంప్లీట్ అయ్యాయట. సినిమా రిలీజ్ కి ముందే అన్ని పాటలు కూడా రెడీ చేసి దేవిశ్రీప్రసాద్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement