Saturday, April 27, 2024

లవ్ స్టొరీ సినిమా రిలీజ్ పై అనుమానాలు ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి.

ముఖ్యంగా సారంగదరియా పాట రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది.ఇదిలాఉండగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కాగా లాక్ డౌన్ అమలు చేసినా, 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టిన సినిమాను నిర్మాతలు రిలీజ్ చేయకపోవచ్చని తెలుస్తోంది. దీని పై పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement