Thursday, March 28, 2024

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి..

మేడ్చల్‌ : తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి దశ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌ మున్సిపల్‌ పట్టణంలోని కురుమ సంఘం భవనంలో దొడ్డి కొమురయ్య 94వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్‌ 23వ వార్డు కౌన్సిలర్‌ కౌడే మహేష్‌ కురుమ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమ సమయంలో దొడ్డి కొమురయ్య చేసిన పోరాటాన్ని ఎన్నటికి మరువలేమని ఆయన కొనియడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ సభ్యులు పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు ఒడ్డు వెంకటేష్‌ కరుమ, మాజీ కురుమ సంఘం అధ్యక్షులు కౌడే సత్తయ్య కురుమ, మాజీ వార్డు సభ్యులు కౌడే నాగేందర్‌ కురుమ, ఒగ్గు వినోద్‌ కురుమ, ఆంజనేయులు, రమేష్‌, ఓంకార్‌, పరమేష్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement