Friday, April 26, 2024

మహేష్ సినిమాకు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. మహేష్ బాబు 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది..

మరో వైపు ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. సుమారు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఈ సినిమాకి త్రివిక్రమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement