Friday, April 19, 2024

లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్ షేర్లతో పాటు, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, ఐటీసీ వంటి బ్లూ చిప్ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 49,206కి చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్ద స్థిరపడింది.

టాటా స్టీల్, హిందోల్కా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ లాభాలతో ముగిశాయి. టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఎయిచర్ మోటార్స్ నష్టాలను చవిచూశాయి. లోహ, ఆర్థిక, టెలికాం రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు దన్నుగా నిలిచింది. అలాగే అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. కరోనా వ్యాక్సిన్‌‌లకు పేటెంట్ హక్కులను రద్దు చేయాలన్న భారత్ ప్రతిపాదనకు అమెరికా అంగీకరించడం మదుపర్లను మెప్పించింది. పేటెంట్ హక్కులు లేకపోతే వ్యాక్సిన్ సరఫరా మెరుగుపడి అందరికీ వ్యాక్సిన్ త్వరగా అందుతుందనే సెంటిమెంట్ పనిచేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement