Thursday, April 25, 2024

ప్రజ‌ల ప్రాణాలు కాపాడండి: నారా లోకేష్

రాష్ట్రాలోని ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి హృద‌య‌ విదార‌కంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు ఉన్నాయని తెలపారు. కరోనా మృత‌దేహాలు, ఆ ప‌క్క‌నే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు..హృద‌య‌విదార‌కంగా ఉంది. వ‌రండాలోనే శ‌వాలు, నేల‌పైనే పేషెంట్లు..ఎవ‌రు బ‌తికున్నారో, ఎవరు చ‌నిపోయారో తెలియ‌ని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ.. ఒకే బెడ్‌ పైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి ప్రాణాలు కాపాడాలన్నారు. ప్రతిప‌క్ష నేతల్ని అక్రమ అరెస్టులు చేయించ‌డంపై చేస్తోన్న స‌మీక్షలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజ‌ల ప్రాణాలు కాపాడ‌టంపై దృష్టి పెట్టాలని నారా లోకేష్‌ సూచించారు. వ్యాక్సిన్ కొన‌డానికి డబ్బుల్లేవ‌ని చేతులెత్తేసి.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాక్సిన్ తెప్పించాలంటూ స‌జ్జల వాగుతున్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అంటే వైసీపీ వాళ్లే నమ్మలేకపొతున్నారని నారా లోకేష్ విమర్శించారు.

ఇదీ చదవండి: అవనిగడ్డలో కోవిడ్ రోగుల దారుణ దృశ్యాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement