Friday, April 19, 2024

బ్రహ్మాకుమారీస్‌ – నేతృత్వ కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో 11వది ‘నేతృత్వ కళ ‘

నేతృత్వ కళ :
నాయకుడంటేనే జన సముదాయమును జాగృతి చేసి ముందుకు సాగింపజేసేవారు. బాబా ప్రతి పురుషర్ధీ ఒక నాయకునిగా, టీచర్‌గా తయారయ్యే విధముగా తీర్చిదిద్వారు. బాబా అందరి విశేషతలను సారంగా ఆయా కార్యాలలో నిమగ్నులుగా చేసే వారు. బుద్ధి సృజనాత్మక కార్యంలో నిమగ్నమయినపుడు సంహారాత్మక కార్యము సమాప్తి చెందుతుంది. రాయి నీటి అలలతో ఏ విధముగా పూజ్యనీయమవుతుందో ఆ విధముగా ఇక్కడ ఇతరుల సేవచేస్తూ, చేస్తూ అర్హులుగా తయారయ్యేవారు. ప్రతి ఒక్కరికి బాబావారి యోగ్యత, అభిరుచిననుసరించి పనులపపగించి అభివృద్ధి గావించేవారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement