Sunday, April 28, 2024

ఐటమ్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

మిల్కీ బ్యూటీ తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఎఫ్3, సిటిమార్, మాస్ట్రో, గుర్తుందా శీతాకాలం వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అయితే మరో వైపు ఐటెం సాంగ్స్ లో కూడా చేయడానికి కూడా రెడీ అవుతుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ లో నటించబోతోంది.

అయితే ఈ సాంగ్ కు తమన్నా రెమ్యూనరేషన్ కాస్త గట్టిగానే కోరుతుందట. మొదట కోటి రూపాయలు కోరగా 75 లక్షల కు ఒప్పుకున్నట్లు సమాచారం. ఐదు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారట. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా… ఉపేంద్ర, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement