Sunday, April 28, 2024

Disha Patani: అందాల ఆర‌బోత‌లో ఆమె త‌ర్వాత దిశా పటా

లోఫర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ అమ్మడు మొదటి సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ దక్కించుకోలేక పోయింది. అదే సమయంలో హిందీలో ధోనీ సినిమాలో నటించే అవకాశం దక్కడం, ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ బిజీ అయ్యింది.

- Advertisement -

బాలీవుడ్‌ లో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్‌ లో ఈ అమ్మడు వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలతో రెగ్యులర్ గా నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా లైఫ్ స్టైల్‌ ఆసియా ఇండియా మ్యాగజైన్ కోసం దిశా పటానీ అందాల ఆరబోత ఫోటో షూట్‌ తో కవర్ పేజీకి ఫోజ్ ఇచ్చింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement