Sunday, April 28, 2024

RIP – ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ క‌న్నుమూత ….

రచయిత, దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా కామెర్ల తో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్క‌డే మ‌ర‌ణించారు.. టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలకు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు..
‘మాస్టర్‌ సురేష్‌’ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగు బిగ్‌ బాస్‌లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు..

హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్‌ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్న సూర్య కిరణ్‌.. దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నాడు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement