Sunday, April 28, 2024

ఏజెంట్ లోడింగ్…మాములుగా లేదు !!

అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు.

ఇదిలావుండగా తాజాగా అఖిల్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోను సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మీకు ముందు ముందు ఉంది పండగ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆ ఫోటోలో అఖిల్ ఫేస్ కనిపించకుండా వీపు మాత్రమే చూపిస్తూ కనిపించాడు. అలాగే ఏజెంట్ లోడింగ్.. మీరు వైల్డ్ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement