Saturday, April 27, 2024

విజయ్ దేవరకొండపై వర్మ ఏమన్నా కామెంట్ చేశాడా !!

రాంగోపాల్ వర్మ మాట మాట్లాడినా…ట్వీట్ చేసిన వెరైటీ గానే ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ పై తనదైన శైలిలో కామెంట్ చేశాడు వర్మ. ఇటీవల లైగర్ సినిమా లోని కొన్ని సీన్స్ చూశానని… విజయ్ సీన్స్ లో టైగర్ లయన్ క్రాసింగ్ కు మించిన ఇంటెన్స్ తో ఉన్నాయని…పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్ ల సూపర్ క్రాస్ గా కనిపించాడని చెప్పుకొచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను కరణ్ జోహార్ తో పాటు ఛార్మి నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement