Monday, April 29, 2024

గోపీచంద్ ‘రామ బాణం’ నుంచి “ధరువెయ్ రా” లిరికల్ సాంగ్ రిలీజ్..

డైరెక్టర్ శ్రీవాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ హీరొ గోపీచండ్ నటిస్తోన్న మూవీ ‘రామ బాణం’. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు మేకర్స్. ఇవ్వాల కర్నూలులో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీలోని రెండో పాటను రిలీజ్ చేశారు.

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను.. కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి పాడగా, మిక్కీ జె.మేయర్ సంగీతీన్ని అందించాడు. ఈ పాట ఒక దేవాలయం నేపథ్యంలో షూట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ పాటలో గోపీచంద్ నుండి జగపతి బాబు వరకు.. ఖుష్బూ నుండి డింపుల్ హయాతి వరకు అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి కనిపిస్తారు. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో గోపీచంద్ పూర్తిగా కొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక, ఈ సినిమా మే 5న థియేటర్లలోకి రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement