Monday, May 6, 2024

ధ‌నుష్ మూవీ కెప్టెన్ మిల్ల‌ర్.. ఎడ్వ‌ర్డ్ ఫ‌స్ట్ లుక్

సార్ చిత్రం విజ‌యంతో మంచి జోష్ మీదున్నాడు త‌మిళ స్టార్ హీరో ధనుష్..కాగా ధనుష్‌ సినిమాలంటే తమిళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో కూడా మంచి క్రేజ్‌ ఉంటుందని తెలిసిందే. ఆయ‌న‌ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ కెప్టెన్‌ మిల్లర్ . ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌, సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. కెప్టెన్‌ మిల్లర్‌లో అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఎడ్వర్డ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లీడింగ్ తమిళ చిత్ర నిర్మాత సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తుంది. ఎడ్వర్డ్‌ కేసరి, మణికర్ణిక, యమ్లా పగ్లా దివానా చిత్రాల్లోల్లో కూడా కీ రోల్స్‌ లో నటించాడు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌ ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement