Tuesday, May 7, 2024

Heroin: సంతోష్ శోభ‌న్ స‌ర‌స‌న హీరోయిన్ గా యూట్యూబ‌ర్ దేత్త‌డి హారిక‌

దేత్త‌డి హారిక.. యూట్యూబ్‌ స్టార్.. బిగ్‌బాస్‌లో కూడా కనిపించింది. ఈమె తెలుగు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికీ పరిచయస్తురాలే. అయితే.. దేత్తడి హారిక యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజా బిగ్ స్క్రీన్ పై మెర‌వ‌నుంది. యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ ప్రధాన కథానాయకుడు కాగా.. అతనికి జోడీగా దేత్తడి హారిక హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా ఇది హారికకు మొదటి సినిమా. అయితే.. ఈ మూవీని బేబీ సినిమా మేకర్స్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌, డైరెక్టర్‌ రాజేష్‌ కలిసి తీస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. డైరెక్టర్‌గా సాయి రాజేశ్‌ ఇప్పటికే బేబీ సినిమాతో యూట్యూబర్‌ వైష్ణవి చైతన్యకు బిగ్‌ హిట్‌ ఇచ్చాడు. మరోసారి తన సినిమాలో ఇంకో తెలుగు యూట్యూబర్‌ను తీసుకోవడం ద్వారా మరో హీరోయిన్‌ని టాలీవుడ్‌కు అందిస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement