Sunday, April 28, 2024

Resign – బీఆర్ఎస్ పార్టీ గ‌జ్వేల్ వ‌ర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీకి రాజీనామా

గజ్వేల్ అక్టోబర్ 29( ప్రభ న్యూస్) అసెంబ్లీ ఎన్నికల గజ్వేల్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిళ్ల నాగు ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నానని ఆదివారం ప్రకటించారు. నాగు 2001 తెలంగాణమళ్ళీ దశ ఉద్యమంలో టిఆర్ఎస్ లో చేరి గజ్వేల్ లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అప్పటికి టీఆర్ఎస్ లో ఎవరు లేనప్పటికీ నాగు క్రియాశీలకంగా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా నాగు సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారు .

అయితే ఏడాది క్రితం జరిగిన టిఆర్ఎస్ పట్టణ శాఖలో నాగు మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పోటీలో ఉన్నప్పటికీ వేరే అతనికి అధ్యక్ష పదవి ఇవ్వడంతో అప్పటినుండి నాగు ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ ( బీఆర్ ఏస్) పార్టీలో సుమారు 20 సంవత్సరాలుగా పనిచేశానని పార్టీలో తనకు గుర్తింపు లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement