Tuesday, April 30, 2024

కుమారైతో క‌లిసి.. బ‌న్నీకి బర్త్ డే విషెష్ చెప్పిన డేవిడ్ వార్న‌ర్

నేడు 41వ ఏడులోకి అడుగుపెట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..కాగా త‌న కుమారై ఐలాతో క‌లిసి కి బ‌ర్త్ డే విషెష్ చెప్పారు క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్. బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ తన కూతురుతో కలసి ఒక వీడియో షేర్ చేశారు. బిగ్ షౌట్ అవుట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్ డే.. పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఈ బర్త్ డే నీకు చాలా గొప్పగా ఉండాలి అంటూ వార్నర్ తన కుమార్తె ఐలాని పిలిచాడు. వెంటనే ఐలా.. హ్యాపీ బర్త్ డే పుష్ప అంటూ ముద్దు ముద్దుగా చెప్పిన విషెస్ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వార్నర్ సన్ రైజర్స్ కి ఆడనప్పటికీ తెలుగు అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్నర్ ని తెలుగు ఆడియన్స్ ఇష్టపడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement