Saturday, April 27, 2024

దసరా కే లైగర్ సన్నాహాలు ?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

షూటింగ్ విషయానికొస్తే మెజార్టీ టాకీ పార్ట్ పూర్తయింది. మిగిలిన బ్యాలెన్సు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. అయితే మిగిలిన షూట్ ను తొందరగా పూర్తి చేసి దసరాకి గాని దీపావళికి గాని బరిలో దించేందుకు ప్లాన్ చేస్తుందట చిత్ర యూనిట్. మరి చూడాలి అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో.

Advertisement

తాజా వార్తలు

Advertisement