Saturday, May 4, 2024

ఓటీటీలో సిద్ద‌మై ‘దాస్ కా ధ‌మ్కీ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ఆహా

ఈ ఏడాది ఉగాదికి రిలీజ్ అయిన మాస్ కా దాస్ విశ్వక్సేన్ సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్సేన్ స్వయం దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ రిలీజ్ కి ముందే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. థియేట‌ర్ వద్ద మంచి క‌లెక్ష‌న్లు రాబట్టి ఘన విజయం సాధించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే థియేట‌ర్లలో ఈ సినిమాని మిస్ అయిన వారు ఈ సినిమా ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని.. రిలీజ్ డేట్ కోసం వేయిట్ చేస్తున్నారు.

కాగా, దాస్ కా ధమ్కి డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న తెలుగు మూవీ స్ట్రీమింగ్ యాప్ ఆహా వీడియోస్ ఈ సినిమా ఓటీటీ డేట్ ని ప్ర‌క‌టించింది. ఈ మూవీ ఇదే నెల (ఏప్రిల్) 14 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే కింగ్ అర్జున్ బ్యాంక్రోల్ చేసారు. అయితే, ఈ సినిమా దాస్ కా ధమ్కికి సీక్వెల్ కూడా ఉండ‌నుంది. దానికి సంబంధించి త్వ‌ర‌లోనే అప్డేట్ ఇవ్వ‌నున్నారు మేక‌ర్స్. ఇక‌, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించ‌గా… లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయిన వారు ఇప్పుడు ఏప్రిల్ 14 నుండి ఆహాలో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement