Monday, May 6, 2024

అమెజాన్ ప్రైమ్ లో క‌స్ట‌డీ.. ఈ నెల 9న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 9నుండి స్ట్రీమింగ్ కానుంది క‌స్ట‌డీ మూవీ.ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య – హీరోయిన్ గా కృతి శెట్టి న‌టించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా రూపొందింది. టైటిల్ తోను .. పోస్టర్స్ తోను ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా – యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేష నిజాయతీ కలిగిన ఒక సాధారణ పోలీస్ .. ఒక భయంకరమైన నేరస్థుడిని ఎలా చట్టానికి అప్పగించాడనేది కథ. శరత్ కుమార్ .. అరవింద్ స్వామి .. ప్రియమణి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. మే 12వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది క‌స్ట‌డీ చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement