Thursday, May 16, 2024

Manjummel Boys : ఆ సినిమాఖ‌ర్చు మూడు కోట్లే…వ‌సూళ్లు @ 100 కోట్లు

ఒకప్పుడు మలయాళ సినిమా పాతిక కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు మినిమం రూ.50 కోట్లు అన్నట్లుగా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దడదడలాడిస్తున్నాయి. తెలుగు, తమిళ సినిమాలకు పోటీ అన్నట్లుగా మలయాళ సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేస్తున్నాయి. ఇటీవల విడుదల అయిన ప్రేమలు , బ్రహ్మయుగం సినిమాలు మలయాళ బాక్సాఫీస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ ఏడాది మేటి చిత్రాల్లో నెం.1 గా మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమా నిలిచింది. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం రూ.మూడు కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. థియేట్రికల్‌ రిలీజ్‌ తోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

- Advertisement -

త్వరలో తెలుగు తో పాటు మరికొన్ని భాషల్లో డబ్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇంకా రూ.50 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు చేసిన ఆశ్చర్యం లేదు అన్నట్లుగా మలయాళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక గుహ నేపథ్యంలో సాగే కథతో మంజుమ్మెల్‌ బాయ్స్ తెరకెక్కింది. చాలా నాచురల్‌ స్క్రీన్‌ ప్లే తో పాటు, అన్ని పాత్రలు కూడా మన పక్కింటి వారు లేదా మన వారు అన్నట్లుగా అనిపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు తెగ ఫిదా అవుతున్నారు.
సినిమా చూస్తున్నంత సేపు కనెక్ట్‌ అయ్యి ఉండటం వల్ల మంచి మౌత్ టాక్ వచ్చింది. అందుకే ఈ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగు లో త్వరలో విడుదల అవ్వబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement