Saturday, May 4, 2024

రా ఆఫీస‌ర్‌గా వ‌స్తున్న విశ్వ‌న‌టుడు.. జూన్ 3న క‌మ‌ల్ కొత్త మూవీ ‘విక్ర‌మ్’ రిలీజ్‌

విశ్వనటుడుకమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను తీస్తున్నారు. ఆయన ప్రస్తుతం విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పాట విడుదలై మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంటుండగా.. సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు ట్రైల‌ర్‌లో తెలుస్తోంది. సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌ను చూస్తుంటే.. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక యాక్షన్ సీన్స్‌కు తగ్గట్లుగా అనిరుధ్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ట్రైలర్‌ సినిమాలపై అంచనాలను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లింది. ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది టీమ్. ఈ సినిమాను జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement