Thursday, May 16, 2024

Sapta sagaralu Daati (Side B) ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ !

రక్షిత్ శెట్టి హీరోగా.. హేమంత్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్‌-ఏ’. ఈ మూవీలో రుక్మిణి కథానాయికగా న‌టించింది. ఈ సినిమాని తెలుగులో సెప్టెంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌గా.. పాజిటివ్ టాక్‌తో మంచి విజయం సాధించింది. ఇక ఆ తరువాత న‌వంబ‌ర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-బీ’ కూడా మంచి విజ‌యం అందుకుంది.

కాగా, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ను అందించారు. సప్త సాగరాలు దాటి సైడ్‌-బీ త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు రక్షిత్ శెట్టి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement