Friday, April 26, 2024

సీటిమార్ ట్రైలర్ కట్…అప్డేట్

యాక్షన్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సీటిమార్. కబడ్డీ నేపధ్యంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదల అయిన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఒక్కో అప్డేట్ ని అందిస్తున్న మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ ని అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు పెట్టిన ఓ ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం సీటీమార్ మాస్ ట్రైలర్ కట్ కి ఇప్పుడు మణిశర్మ అందించిన సాలిడ్ డీటీఎస్ మిక్సింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ ట్రైలర్ ని అతి త్వరలోనే రిలీజ్ చెయ్యనున్నట్టుగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement