Sunday, May 5, 2024

వీరయ్య గా మెగాస్టార్…?

మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒక మూవీ కంప్లీట్ అవ్వక ముందే మరో రెండు మూడు సినిమాలు లైన్ లో పెడుతున్నారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా వున్నారు. ఇక దీని తర్వాత మరో మూడు సినిమాలు ఇప్పటికే ఓకే అయ్యాయి. వీటిలో మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ ఒకటి. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ‘ఆచార్య’ తర్వాత ఇదే ముందుగా సెట్స్ కి వెళుతుంది. దీని దీని తర్వాత వేదాళం రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చిరు నటించబోయే ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు గాసిప్స్ వస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement