Monday, April 29, 2024

ఆ పొట్టి నిక్కరు అవసరమా అనసూయ !!

జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే… మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తోంది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో సైతం నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా హోలీ జరుపుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో పొట్టి నిక్కర్ తో అనసూయ కనిపించింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అనసూయ పై సెటైర్లు వేస్తున్నారు. అంత పొట్టి నిక్కర్లు వేసుకుని ఫోటోలు దిగడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా అనసూయ ఫోటోలపై పలుమార్లు నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అనసూయ వారికి ఘాటుగానే రిప్లై ఇచ్చింది. మరి ఈసారి ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement