Tuesday, May 7, 2024

కెప్టెన్ మిల్ల‌ర్.. ఫ‌స్ట్ లుక్ అప్ డేట్

కెప్టెన్ మిల్ల‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్ అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్.ఈ చిత్రంలో హీరోగా ధ‌నుష్ న‌టిస్తున్నాడు. కాగా యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కెప్టెన్ మిల్లర్‌ ఫస్ట్‌ లుక్‌ను జూన్‌లో విడుదల చేసి.. టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. వైట్ బనియన్‌లో కనిపిస్తున్న ధనుష్‌ చేతిలో గన్‌ పట్టుకొని వెళ్తున్న లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్‌ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లీడింగ్ తమిళ చిత్ర నిర్మాత సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. కెప్టెన్ మిల్లర్‌ను ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌, సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement